కరోనా వైరస్ ప్రపంచాన్ని గత ఐదు నెలలుగా ఎంతలా వణికిస్తుందో తెలుస్తూనే ఉంది. ఈ వైరస్ వచ్చి చనిపోయే వారి సంఖ్య గతంతో పోలిస్తే చాలా వరకు తగ్గింది. వైరస్ ను ముందుగానే గ్రహిస్తే మందుల ద్వారా తగ్గించేస్తున్నారు. కానీ వైరస్ వచ్చి తమకు తగ్గిపోయిందని ఆనందపడుతున్నవారికి ఇప్పుడు మరొక విస్తుపోయే నిజాన్ని మాంచెస్టర్ యూనివర్సిటీ అడియాలజిస్టులు, మాంచెస్టర్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ కలిసి చేసిన అధ్యయనంలో తెలుస్తుంది.

హమ్మయ్య తమకు కరోనా వైరస్ తగ్గిపోయిందని, తమలో యాంటీ బాడీలు సమృద్ధిగా ఉన్నాయని, మరోసారి తమను కరోనా వైరస్ తాకడం కష్టమనుకుంటున్నవారికి మాత్రం మింగుడుపడని అంశమే. కరోనా వైరస్ సోకి తగ్గినవారిలో వినికిడి లోపం అధికంగా ఉంటుందట. కొంతమంది పూర్తిగా వినికిడి శక్తి కోల్పోతున్నట్లు వారు అధ్యయనంలో తేలినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం కరోనా సోకి తగ్గిం 121 మందిపై అధ్యయనం చేస్తే అందులో 16 మందికి వినికిడి శక్తి ఉండటంతో పాటు వారిలో కొంతమంది పూర్తిగా వినికిడి శక్తి కోల్పోయినట్లు తెలుస్తుంది. అంటే 121 మందిలో దాదాపుగా 13.2 శాతం మందికి వినికిడి శక్తి వచ్చిందని తెలుస్తుంది.

దీనితో మాంచెస్టర్ శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే కరోనా వైరస్ సోకిన వారు ఎక్కువగా మాస్కులు ధరించడంతో పాటు, వారు వేసుకున్న మందుల వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని, దీని వలన రాబోయే రోజులలో మరింత మందికి ఇలాంటి కొన్ని రోగాలు సంబంవించే అవకాశముందని చెబుతున్నారు. కరోనా వైరస్ ను అయితే వచ్చినవారికి నయం చేయగలుగుతున్నాం గాని, ఇలా సైడ్ ఎఫెక్ట్స్ వలన మరింత ఆపద ఎక్కువగా ఉండే అవకాశముందని, దీనిని త్వరగా నియంత్రించి మందులు మార్చి ఇవ్వవలసిన అవసరముందని హెచ్చరిస్తున్నారు.