కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం వణికిస్తుంటే, ఇప్పుడిప్పుడే మన దేశంలో కరోనా కోరలను చాస్తుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరగడంతో పాటు 20 వేల కేసులకు తక్కువ కాకుండా రోజు నమోదవడంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ వచ్చిందన్న విషయం తెలిస్తేనే ఆ చుట్టు పక్కలకు వెళ్లడానికి భయపడే జనం వారితో కలసి ఏకంగా బస్సులో ప్రయాణించడంతో ఇప్పుడు వారంతా ఆందోళన చెందుతున్నారు.

కరోనా వైరస్ ఉందని తెలిసినా తెలంగాణలో ముగ్గురు వ్యక్తులు బస్సులో ప్రయాణించడంతో ఇప్పుడు అది తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది.ఇటీవల ముగ్గురు వ్యక్తులు నిర్మల్ నుంచి హైదరాబాద్ వచ్చారు. వారికి కరోనా లక్ష్యణాలు ఉండటంతో వారు టెస్ట్ లు చేయించుకోగా అందులో పాజిటివ్ అని తేలడంతో వారు ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రిలో చేరడానికి సికింద్రాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళడానికి బస్సెక్కారు.

వారికి కరోనా ఉందన్న విషయం ఎవరకి చెప్పకుండా వారు ఆదిలాబాద్ వెళ్లిన తరువాత రిమ్స్ కు వెళ్లి నేరుగా తమకు కరోనా ఉందని ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అసలు మీరు ఎక్కడ నుంచి వస్తున్నారు, ఎక్కడ టెస్ట్ లు చేపించుకున్నారని అడుగగా, వారు పూర్తి వివరాలు చెప్పడంతో పాటు తాము బస్సులో ప్రయాణం చేశామని చెప్పడంతో అధికారులు అప్రమత్తమై వారితో పాటు బస్సులో ప్రయాణం చేసిన అందరిని క్వారంటైన్ కు తరలిస్తున్నారు.

ఇలా కరోనా లక్ష్యణాలు ఉన్నాయని తెలిసినా మరొక 20 మందిని ప్రమాదంలోకి నెట్టేయడంతో వారంతా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వైరస్ ఎవరకి సోకిందో అని… వారు ఎక్కడెక్కడ తిరిగారో అని అధికారులంతా భయాందోళనకు గురవుతున్నారు. అసలే కరోనా కేసులు తెలంగాణాలో అత్యధికంగా నమోదవుతుంటే ఇప్పుడు ఇలా బస్సులో ప్రయాణించి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

కొడుకులు, కోడళ్ల ఛీత్కారంతో బతికి చెడ్డ ఒక పెద్దాయన కన్నీటి గాధ