ఓ యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లక్ష్మి విహార్ పీజ్-2 , నల్లగొండ్ల విల్లా నెంబర్ 43లో శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కుటుంబం నివాసముంటుంది. ఇక విల్లా నెంబర్ 18లో బాధితురాలి యువతీ నివాసముంటుంది.

ఇక సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి 10.30 గంటలకు పార్కింగ్ విషయంలో ఆ యువతికి కార్పొరేటర్ కి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కార్పొరేటర్ ఆ యువతీ పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఆమెపై చేయిచేసుకున్నాడు. దీనినంతటిని బాధితురాలి సోదరి సెల్ ఫోన్ లో రికార్డు చేసింది. ఇక బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఆ యువతిపై కేసు పెట్టింది. ఇక కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు.

తెలంగాణలో భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!

వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటున్న శివబాలాజీ..!

శర్వానంద్ మూవీ కూడా ఓటిటి బాటలోనే..!