ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగిపోయాయి. ఇక అత్యాచారాలకు పాల్పడుతున్న మృగాళ్లపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఈ విధమైన అత్యాచారాలు చూడలేక చివరికి న్యాయవాదులు కూడా నిందితులపై దాడులకు దిగుతున్నారు.

మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో ఓ న్యాయస్థానం ముందు ఓ అత్యాచార నిందితుడిపై న్యాయవాదులు దాడికి దిగారు. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడంతో అతనిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. దీనితో అతడిపై ఆగ్రహంతో రగిలిపోయిన న్యాయవాదులు.. ఆ మృగాడిపై దాడి చేసి కొట్టారు. దీనితో పోలీసులు అతడిని రక్షించి తీసుకుపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది.