నింధితులు సరైన ఆదారాలు లభించక, వారు పోలీసులను ఇబ్బందికి గురి చేస్తున్న వేళ వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి నిజాన్ని బయటకు చెప్పేలా చేస్తారు. ఇక థర్డ్ డిగ్రీ ఉపయోగించే సమయంలో కొంతమంది నింధితులు ఆ బాధను తట్టుకోలేక వారు చేయని తప్పును కూడా ఒప్పుకుంటారని అభిప్రాయం ఉంది. పోలీసులు ఉపయోగించి థర్డ్ డిగ్రీ అంత దారుణంగా అంటుంది.

కానీ ఇలా థర్డ్ డిగ్రీ ఉపయోగించి నిందితుల నుంచి ఆధారాలు సేకరించడం సరైంది కాదని, వేరొక మార్గాలలో వారి నుంచి ఆధారాలు సేకరించాలని, థర్డ్ డిగ్రీకి స్వస్తి చెప్పాలని హైకోర్టు అభిప్రాయపడింది.ఇక థర్డ్ డిగ్రీ కావచ్చు మరేదైనా పోలీస్ విచారణలో భాగంగా గాయపడిన వారు ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం ఆశించవచ్చని కోర్టు తెలియజేయడం జరిగింది.