మాస్ రాజా రవితేజ-గోపి చంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా తెరకెక్కుతుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘డాన్ శ్రీను’, ‘బలుపు’ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముచ్చటగా మూడవ సినిమా తెరకెక్కుతుంది. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో స్టార్ట్ అయ్యింది.

ఇటీవల తెలుగు రాష్ట్రాలలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమా కథ తయారు చేసినట్లు దర్శకనిర్మాతలు తెలిపారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించనున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఘని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి వచ్చే సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. ఠాగూర్ మధు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.