నిషేధిత డ్రగ్ తీసుకున్నాడని టీమిండియా యువ ఆటగాడు పృథ్విషాను బీసీసీఐ ఎనిమిది నెలలు పాటు వేటు వేసిన సంగతి తెలిసిందే. కానీ పృథ్వి షా మాత్రం తనకు ఆ సమయంలో దగ్గు ఉండటంతో నేను దగ్గు మందు తీసుకున్నానని అంతకన్నా తనకు ఏమి తెలియదని వ్యాఖ్యానించాడు. తాను తీసుకున్న దగ్గు మందులో నిషేధిత డ్రగ్ ఉందన్న విషయం తనకు తెలియదని చెప్పుకొచ్చాడు.

ముంబై జట్టు కోచ్ మాత్రం చెబుతూ అసలు ముస్తాక్ ఆలీ ట్రోఫీ సమయంలో పృథ్వి షాకు అసలు దగ్గే లేదని, పృథ్వికి ఆ సమయంలో దగ్గు మాత్రమే ఉందని కోచ్ స్పష్టం చేస్తున్నాడు. దీనిపై పృథ్వి షా ఏమైనా స్పష్టత ఇస్తాడా అన్నది చూడాలి. కొంత మంది సీనియర్ క్రికెటర్లు మాత్రం పృథ్వి షాకు బాసటగా నిలుస్తూ… బీసీసీఐ ఎనిమిది నెలలు నిషేధించడం అనేది చాల పెద్ద నిర్ణయం అని,  ఒక యువ ఆటగాడి కెరీర్ ఎనిమిది నెలల పాటు మరుగున పడిపోకుండా సమీక్షించాలని అడిగారు.  

 

  •  
  •  
  •  
  •  
  •  
  •