చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదలైన దగ్గర నుంచి ధోనితో పాటు సురేష్ రైనా కూడా అదే జట్టులో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో దుబాయ్ లో ఐపీఎల్ టోర్నీ నిర్వహించాలనుకోవడంతో చెన్నై జట్టు సభ్యులంతా అక్కడకు వెళ్లగా, అక్కడ హోటల్ లో తనకిచ్చిన రూమ్ మార్చాలని, కోరడం దానికి చెన్నై జట్టు యాజమాన్యం ఒప్పుకోకపోవడంతో అతడు అలిగి వచ్చేసినట్లు తెలుస్తుంది. దీనితో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చైర్మన్ శ్రీనివాసన్ ఆగ్రహంగా ఉన్నారట.

ఇలా రూమ్ మార్చలేదన్న అక్కసుతో రైనా ఏకంగా టోర్నీ వదిలి పెట్టి వెళ్లడంపై అతడికి ఈ ఏడాది రావాల్సిన 11 కోట్ల రూపాయలను కూడా ఇచ్చేది లేదని ఇప్పటికే ప్రకటించారు. దీనితో పాటు ఇప్పుడు ఏకంగా అతడిని చెన్నై జట్టు నుంచే తొలగించాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తోందట. దీనికి ఊతం ఇచ్చేలా అతడిని వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించి షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సురేష్ రైనా ఏమాత్రం తనకు CSK కు నాకు మధ్య ఎలాంటి వివాదం లేదని, కుటుంబం కోసమే వెనక్కు వచ్చానని చెబుతున్నారు. కానీ అతడు దుబాయ్ వెళ్లిన తరువాత కొత్త రూమ్ కోసం గొడవ చేయడం దానిని ఒప్పుకోకపోవడంతో ధోనికి కూడా చెప్పడంతో తాను ఏమి చేయలేనని చేతులెత్తేయడంతో అతడు అలిగి వచ్చేసాడు. కానీ అతడి వ్యవహారంతో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.