మాజీ టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ ఆధ్వర్యంలో ఐపీఎల్ టోర్నీ కోసం వారం రోజుల క్రితం దుబాయ్ లో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లకు కరోనా ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే బౌలర్ దీపక్ చాహార్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఈరోజు మహారాష్ట్రకు చెందిన ఋతురాజ్ గైక్వాడ్ అనే బ్యాట్స్ మ్యాన్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరితో పాటు జట్టు సహాయకులు 11 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఇప్పుడు జట్టుని కరోనా వైరస్ తీవ్రంగా బాధిస్తుంది.

దీనితో ఇప్పుడు మిగిలిన జట్లకు కూడా కరోనా వైరస్ ఫీవర్ పట్టుకుంది. తమకు కూడా కరోనా వైరస్ అంటుకుంటుందేమో అని బయటపడుతున్నారట. ఇంకా మ్యాచ్ లు మొదలు కాక ముందే క్వారంటైన్ లో ఉంటున్న సమయంలోనే ఇలా కరోనా బాధిస్తుంటే, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ ఐన తరువాత భౌతిక దూరం పాటించడం కాస్త కష్టమైన పని కావడంతో అప్పుడు ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సురేష్ రైనా ఐపీఎల్ నుంచి తప్పుకొని ఇండియా తిరిగి వచ్చేస్తున్నట్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం తెలియచేసింది. దీనితో రాబోయే రోజులలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోలుకోవడం కష్టమని, వారి జట్టుపై ఇది తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

ఐపీఎల్ నుంచి సురేష్ రైనా అవుట్, సిరీస్ మొదలు కాక ముందే ఒక వికెట్ డౌన్

విజయ్ దేవరకొండ సినిమాకు హిందీలో బ్రహ్మరధం

మొగుడు వదిలేసాడు, ప్రియుడు గెంటేశాడు చివరకు తీరం తెలియక