ఓ సైకిల్ మెకానిక్ ను ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఉత్తరప్రదేశ్ లోని ఫైజాబాద్ షరీఫ్ చాచా స్వస్థలం. పెద్దగా చదువుకొని చాచా సైకిల్ మెకానిక్ గా స్థిరపడ్డాడు. 28 ఏళ్ళ క్రితం బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన హింసలో తన పెద్ద కొడుకు మరణించాడు .ఈ విషయం షరీఫ్ కు నెల రోజులకు గాను తెలియలేదు. అప్పటికే పూర్తిగా కుళ్లిపోయి అనాథలా ఉన్న తన కుమారుడి శవం రైలు పట్టాలపై పడి ఉండడాన్ని షరీఫ్ చలించి పోయాడు.

తన కన్న కొడుకుకి పట్టిన గతి ఇంకా ఎవరికి పట్టకూడదని అప్పుడే సంకల్పం చేసాడు. ఎక్కడ గుర్తు తెలియని మృత దేహాలు కనిపించిన వాటిని షరీఫ్.. కులం, మతంతో సంబంధం లేకుండా వాటికి సాంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు నిర్వహించేవాడు. ఒక వ్యక్తి చనిపోయిన 72 గంటల తర్వాత కూడా ఎవరు శవాన్ని తీసుకోవడానికి రాకపోతే వాటిని సాంప్రదాయ బద్దంగా దహన సంస్కారాలు నిర్వహిస్తాడు.

కాగా ఇప్పటివరకు షరీఫ్ ఈ విధంగా 25 వేల శవాలకు దహన సంస్కారాలు నిర్వహించాడు. హిందూ, ముస్లింలతో నాకు సంబంధం లేదు. నా దృష్టిలో అందరు మనుషులే అంటారు షరీఫ్. అంతటి గొప్ప మనసున్న షరీఫ్ ను ఇప్పుడు ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.