పేద వారికి డబ్బు ఎరగా వేసి వారి నుంచి పొందవలసిన సుఖాలన్నీ బడా బాబులు పొందుతూ పైశాచికానందం పొందే సంఘటనలు ప్రతిరోజు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతూనే ఉంటాయి. కానీ కొంతమంది మాత్రం తమకు డబ్బు ఇబ్బందులు ఉన్నా తమ మానాన్ని అమ్ముకోకుండా కష్టపడి కూలోనాలో పని చేసుకుంటూ బతుకుతుంటారు. అలానే ఢిల్లీలోని ఇండియా గెట్ సమీపంలో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో బుకింగ్ ఎగ్జిక్యూటివ్ గా, టూరిస్టులకు గైడ్ ఒక యువతి పనిచేస్తుంది.

అదే ఫైవ్ స్టార్ హోటల్ లో దిగిన కొంతమంది ఆమెతో మాటలు కలిపి ఆమె చాలా ఇబ్బందులలో ఉందని తెలుసుకొని ఆమెకు తమ రూమ్ కు పిలిచి నీకు తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తామని, నువ్వు నీ అవసరం తీరిపోయాక డబ్బు తిరిగి ఇచ్చేయవచ్చని కల్లబొల్లి మాటలు చెప్పి ఆమె పూర్తిగా తమను నమ్మిందని అనుకున్న తరువాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెపై జరిగిన అత్యాచారానికి వారిపై ఆ యువతి దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఆరుగురు వ్యక్తులపై వివిధ సెక్షన్స్ లో కేసులు నమోదు చేశారు.