ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో మరొక రెండు రోజులు స్కూల్స్, కాలేజీలకు సెలవులను ప్రకటించాలని తెలంగాణ సర్కార్ భావిస్తుంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ, రేపటి నుంచి దాదాపుగా కోటినర్ర మంది ఊర్ల నుంచి హైదరాబాద్ తిరిగి రానున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రైవేట్ వాహనాలను నమ్ముకున్న తెలంగాణ సర్కార్ ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రైవేట్ వాహనాలు నమ్ముకుని ఉంది.

ఇక రెండు రోజులు సెలవులు పెంచడంతో విద్య సంస్థల బస్సులను కూడా ప్రజా రవాణాకు ఉపయోగించుకునే యోచనలో ఉంది. ఇక ఊర్ల నుంచి తిరుగు ప్రయాణమైనా వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశారు. దాదాపుగా సగం ఆర్టీసీ బస్సులను తిప్పుతుండటంతో, మిగతా సగం డిపోలకే పరిమితమయ్యాయి. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు నడపగలిగిన వారిని హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారిని విధులలోకి తీసుకొని డ్రైవర్, కండక్టర్ రోజు వారి వేతనం చొప్పున బస్సులను తిప్పుతుంది.