అడిలైడ్ వేదికగా పాకిస్థాన్ తో జరుగుతునం టెస్ట్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ చెలరేగిపోయి 335 పరుగులు చేసాడు. కచ్చితంగా వెస్టిండీస్ ప్లేయర్ బ్రియాన్ లారా చేసిన 400 పరుగులను ఛేదించి సరికొత్త రికార్డు సృష్టిస్తాడు అనుకుంటున్న సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ ఫైన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో క్రికెట్ అభిమానులు అతడిపై మండిపడుతున్నారు. నీ అంత చెత్త కెప్టెన్ ప్రపంచంలోనే లేడని సోషల్ మీడియాలోలో పోస్టులతో చెలరేగిపోతున్నారు.

ఇక దీనికి సంబంధించి డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ తాను 335 పరుగులు చేయడం చాల ఆనందంగా ఉందని, తమ కెప్టెన్ తాను 400 పరుగులు చేస్తానని అభిమానులు భావిస్తున్న తరుణంలో ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం సంగతి పక్కనపెడితే పెద్ద బౌండరీలు ఉన్న అడిలైడ్ లో పరుగులు చేయడం కాస్త కష్టమేనని ఇక లారా చేసిన 400 పరుగులు చేయాలంటే మరింత కష్టపడాలని అన్నారు. కానీ ఈ ఫీట్ ను సాధించడం హిట్ మ్యాన్ గా పేరుగాంచిన రోహిత్ శర్మకే సాధ్యమని, రోహిత్ శర్మపై తనకు నమ్మకముందని ఎప్పటికైనా 400 పరుగులు చేస్తాడని చెప్పుకొచ్చారు.