చెప్పడానికి కథ ఉన్నా చెప్పలేకపోవడమనేది ఆ దర్శకుడిలో ఉన్న లోపం… అసలు చెప్పడానికి కథ లేకపోయినా విసిగించకుండా సినిమా తీయడమనేది ఆ దర్శకుడి గొప్పదనం. ఇందులో “డియర్ కామ్రేడ్” దర్శకుడు భరత్ కమ్మ మొదటి కేటగిరిలోకి వస్తాడు. సినిమా కథలో అద్భుతమైన స్టఫ్ ఉంది కానీ ఆ కథను ఎప్పుడు బయటకు తీస్తాడా అని చూసేలోపు ఫాస్ట్ హాఫ్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో విజయ్ దేవరకొండను ఎలివేట్ చేయడానికే ఉపయోగించాడు తప్ప కథలోకి వెళ్లి దాని లోతు పాట్లను పరీక్షించిన పాపాన పోలేదు.

దర్శకుడు భరత్ కమ్మ… విజయ దేవరకొండను ఎలా చూపించాలో చాల కన్ఫ్యూషన్ కు గురైనట్లు ఉన్నాడు. అర్జున్ రెడ్డి సినిమాలా ఒకవైపున గొడవలకు దిగుతూ మరోవైపున ఆవేశంతో కూడిన ప్రేమను చూపించి ఎమోషనల్ గా ప్రేక్షకులను టచ్ చేయాలని చూశాడు. కానీ కథలో ఉన్న స్టఫ్ ను సరిగ్గా ఉపయోగించుకోవడంలో బోల్తాపడ్డాడు.

మనకు ఇష్టమైన దాని కోసం పోరాటం చేయాలనే కాన్సెప్ట్ తో విద్యార్థి నాయకుడిగా, ప్రేమికుడిగా, ప్రేమ విఫలమైన క్యారెక్టర్ లో విజయ్ ఆకట్టుకున్నాడు. విప్లవ బావాలున్న ఒక వ్యక్తి ప్రేమలో పడటం తన భావాలకు ప్రేమకు జరిగే సంఘర్షణలో తాను ఎదుర్కొనే పరిస్థితులను విజయ్ నటన అలరిస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా విప్లవ భావాలతో హీరోను ఎలివేట్ చేస్తూ హీరో హీరోయిన్స్ మధ్య రొమాన్స్ పండించడానికి సరిపోయిన దర్శకుడికి, సెకండ్ హాఫ్ లో కథ ట్రాక్ మీదకు వచ్చిందనుకున్న సమయంలో సాగదీసే ధోరణితో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడు. ఇక హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న లిల్లీ పాత్రలో స్టేట్ క్రికెట్ ప్లేయర్ గా 

సమాజంలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై నటించింది. హీరోతో చేసే రొమాన్స్ తో పాటు ఎమోషన్స్ సీన్స్ లో అకట్టుకున్న, డబ్బింగ్ చెప్పడంలో కొంత తడపడినట్లు కనిపిస్తుంది.

దర్శకుడు భరత్ కమ్మ కొంచెం పొయిటిక్ స్టైల్ టేకింగ్ తో కొన్ని సెక్షన్ల ఆడియన్స్ కు నచ్చినా అందరిని మెప్పించడం అయితే కష్టమే. బలమైన ఎమోషన్స్ లేవు, డైలాగ్స్ ఒకటి రెండు తప్ప ఆకట్టుకునేవి లేకపోవడం ఎంతసేపటికి సినిమాలో కొత్తదనం చూపించకుండా అర్జున్ రెడ్డి, గీత గోవిందంలకు వచ్చిన హీరో ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని తాను ఏమి తీయాలనుకుంటున్నాడో సరైన క్లారిటీ లేక పట్టుకోల్పోయాడు.

సినిమాలో జస్టిస్ ప్రభాకర్ సంగీతం అలరిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సినిమా నాలుగు బాషలలో తెరకెక్కడంతో అంతా కొత్త వారనే భావన కలుగుతుంది. ఒక కాలేజీ స్టూడెంట్ స్టేట్ క్రికెట్ ప్లేయర్ మధ్య నడిచే ఈ సినిమా కొంత ఆకట్టుకునేలా, కొంత సాగదీసే ధోరణిలో ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉందనడంలో అతిశయోక్తి కాదు.

చివరగా : గీత గోవిందం పబ్లిసిటీకి నోటా రేటింగ్ లా ఉంది

రేటింగ్ : 2.25/5 

రివ్యూ బై : శ్రీకాంత్ గుదిబండి
  •  
  •  
  •  
  •  
  •  
  •