డిసెంబర్ మాసం వచ్చిందంటే చలి గాలులతో పాటు సంక్రాంతి పండుగ వాతావరణం కూడా తీసుకువస్తుంది. డిసెంబర్ 15 నుంచి పల్లెటూర్లో ఉదయాన్నే హరిదాసులతో పాటు గంగిరెద్దుల హడావిడి మొదలవుతుంది. ఇక ఇదే డిసెంబర్ మాసంలో క్రిస్టమస్ పండుగను కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్ సోదరులు చాల పెద్ద పండుగగా జరుపుకుంటారు.

ఈ డిసెంబర్ మాసంలో బ్యాంకు సెలవులకు సంబంధించి ఐదు ఆదివారాలు, రెండు శనివారాలు, ఒక క్రిస్టమస్ పండుగతో పోల్చుకుంటే మొత్తం ఎనిమిది సెలవులు ఉన్నాయి. అంటే బ్యాంకులు పని చేసేది 23 రోజులు మాత్రమే. అన్ని జాతీయ బ్యాంకులకు ఈ సెలవులు వర్తిస్తాయి. అందువల్ల వ్యాపారస్తులు ముందుగానే ఒక ప్లాన్ చేసుకొని సెలవులలో ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోవడం మంచిది.