బాలీవుడ్ చిత్ర పరిశ్రమను డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత ఈ డ్రగ్ కేసు వెలుగులోకి వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ శుక్రవారం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ముందు హాజరైనది. ఇక ఈరోజు తాజాగా ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునె కూడా ఎన్సీబీ ముందు హాజరైంది. ఈ విచారణలో దీపిక పలు విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.
ఇక దీపికా పదుకునెను నాలుగు గంటల పాటు ఎన్సీబీ అధికారులు విచారించారు. జాతీయ మీడియా సమాచారం మేరకు దీపికా నిజాలు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు తాను మేనేజర్ కరిష్మా ప్రకాష్ తో 2017 అక్టోబర్ లో డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించిందని తెలుస్తుంది. కాగా దీపికా తన మేనేజరు కరిష్మా ప్రకాష్ మరియు టాలెంట్ మేనేజర్ జయ సాహాలతో జరిపిన వాట్సాప్ ఛాట్ లో నిషేధిత ‘మాల్’ ‘హ్యాష్’ గురించి డిస్కస్ చేసినట్లు బయటకు వచ్చింది. దీంతో దీపికా నుండి మరింత సమాచారం లాగే ఆలోచనలో ఉన్నారు ఎన్సీబీ అధికారులు.
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెరపైకి బడా నిర్మాత పేరు..!
కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన.. రాబోయే ప్రమాదాన్ని ఊహించడానికే కష్టంగా ఉంది..!
తండ్రికి అనారోగ్యం.. ఐపీఎల్ కి దూరం కానున్న స్టార్ ప్లేయర్..!
కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకోవద్దని అగ్రహీరోకు చివాట్లు పెట్టిన బాలు