బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ కోసం ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకునే శనివారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు విచారణకు హాజరైంది. ఈరోజు ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఆమె ముంబైలోని ఎన్‌సీబీ సిట్ కార్యాలయంలోకి వచ్చారు. దీపికతో పాటు ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్, హీరోయిన్లు శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను కూడా ఎన్‌సీబీ అధికారులు ప్రశ్నించనున్నారు. ముందుస్తు జాగ్రత్తగా ఎన్‌సీబీ కార్యాలయం ముందు ముంబై పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఈ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను శుక్రవారం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) ముందు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఎన్‌సీబీ పిలుపు మేరకు గురువారమే గోవా నుండి ముంబై వచ్చిన రకుల్.. ఈరోజు విచారణకు హాజరైంది. డ్రగ్స్ వాడకంపై రకుల్ ను ప్రశ్నించిన ఎన్‌సీబీ.. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సంపాదించినట్లు తెలుస్తుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి పబ్‌జీ..!

పెళ్లిలోను, చావులోనూ, గెలిచినా, ఓడినా ఎప్పటికి మీ పాట వినిపిస్తూనే ఉంటుంది

కమర్షియల్ చట్రంలో ఇరుక్కొని కెరీర్ నాశనం చేసుకోవద్దని అగ్రహీరోకు చివాట్లు పెట్టిన బాలు