బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. అతడి ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. అయితే ఆయన డెత్ మిస్టరీని తేల్చే క్రమంలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పుడు ఒక్కొక్కరి పేర్లు బయటకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ డ్రగ్ కేసులో రియా చక్రవర్తి బుక్ కాగా ఆమె పలువురి హీరోయిన్ల పేరు బయటపెట్టినట్లు తెలుస్తుంది.

ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికాపదుకునే పేరు ఈ డ్రగ్స్ లిస్ట్ లో ఉన్నట్లు తెలుస్తుంది. జయ వాట్సాప్ చాట్ సమాచారాన్ని బట్టి దీపికా ఆమె మేనేజర్ కరిష్మా డ్రగ్ గురించి ఆమెతో చర్చించినట్లు అధికారులు భావిస్తున్నారు. అందులో ఉన్న కోడ్ భాష ప్రకారం ‘డి’ అంటే దీపికా, ‘కే’ అంటే కరిష్మా అని అనుమానిస్తున్నారు. దీంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దీపికా ఆమె మేనేజర్ కరిష్మాకు సమన్లు జారీ చేశారు. ఇక డ్రగ్ కేసులో రియాతో పాటు జయా కూడా కీలకంగా మారారు. ఇక దీపికా పదుకునే కూడా ఈ వారంలోనే విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది.

భారత్ కి భారీ ఊరట.. ఒక్కరోజులోనే లక్ష మందికి పైగా రికవరీ..!

యువతిపై చేయిచేసుకున్న కార్పొరేటర్.. అరెస్ట్ చేసిన పోలీసులు..!

వాళ్ళను వదిలే ప్రసక్తేలేదంటున్న శివబాలాజీ..!