బడా కార్పొరేట్ దిగ్గజాలు విద్యార్థుల ప్రతిభకు పట్టం కడుతూ మంచి మంచి వేతనాలు ఇవ్వడానికి ముందుకు రావడంతో విద్యార్థులు తమ విద్యాసంవత్సరం ముగియక ముందే క్యాంపస్ ల ద్వారా కోట్ల రూపాయల వేతనాలతో ఉద్యోగ భరోసా పొందుతున్నారు. ఢిల్లీలోని ట్రిపుల్ ఐటి లో కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థినికి పేస్ బుక్ సంస్థ దాదాపుగా కోటినర్ర వార్షిక వేతనం ఇచ్చి ఆమెను తమ కంపెనీలోకి స్వాగతం పలికింది.

ఆ విద్యార్థినికి నెలకు 12 లక్షల వేతనంతో తన ఉద్యోగాన్ని మొదలు పెట్టనుంది. దేశరాజధాని ఢిల్లీలో ట్రిపుల్ ఐటి కాలేజీలో చదువుతునం ఆ విద్యార్థికి జాక్ పాట్ అని చెప్పుకోవచ్చు. ఈ కళాశాల నుంచి దాదాపుగా 2020 ఏడాదికి సంబంధించి క్యాంపస్ ఇంటర్వ్యూలలో 562 మందికి ఉద్యోగాలు లభించాయి. వీరిలో 310 మంచికి ఫుల్ టైమ్ ఉద్యోగాలు, మిగిలిన వారికి ఇంటర్న్ షిప్ లు లభించాయి. ఉద్యోగాలు లభించిన వారికి సగటున 33 నుంచి 43 లక్షల వార్షిక వేతనాలు దక్కాయని కాలేజ్ యాజమాన్యం తెలియచేసింది.

  •  
  •  
  •  
  •  
  •  
  •