ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఖరారు అయ్యింది. బుధవారం ఉదయం జరగనున్న క్యాబినెట్ భేటీ అయిన తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం సాయంత్ర ప్రధాని మోదీని కలవనున్న జగన్.. మూడు రాజధానులు, శాసన మండలి రద్దు మొదలైన విషయాలపై చర్చించనున్నారు.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున ఈ తీర్మానాన్ని ఆమోదించేలా చొరవ తీసుకోవాలని జగన్ ప్రధానిని కోరనున్నారు.అలాగే విభజన చట్టంలోని అంశాలు, పోలవరం నిధుల గురించి కూడా జగన్ చర్చించనున్నారు. ఇక ప్రధాని భేటీ తరువాత కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో కూడా జగన్ భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.