ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షామి ఇండియా కంపెనీ ఎండీ మను కుమార్ జైన్ డెలివరీ బాయ్ ఎండీ అవతారమెత్తాడు. యుగంధర్ రెడ్డి అనే కస్టమర్ రెడ్ మీ నోట్ 8 ప్రో ను ఆర్డర్ చేశాడు. ఆ ఫోన్ ను స్వయంగా కంపెనీ ఎండీ మను కుమార్ జైన్ తీసుకొచ్చి యుగంధర్ రెడ్డి కి డెలివరీ చేసాడు. ఈ సందర్భంగా మాట్లాడిన జైన్.. కొత్త ఫోన్ లను విడుదల చేసిన ప్రతిసారి ఇలా కస్టమర్ ల ఇంటికి వెళ్లి ఇవ్వడం అలవాటని.. వారి ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం అన్నారు.

అయితే యుగంధర్ రెడ్డి ఇప్పటికే వారి ఇంటిలో చాలా ఏంఐ ఉత్పత్తులను వినియోగిస్తున్నారట. ఆయన కుటుంబంలో రెడీమి నోట్ 7 ప్రో, ఏంఐ ఏ3 , పివోసివో ఎఫ్ 1 వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.