విజయ్ దేవరకొండ కష్టాలలో ఉన్న వారికి దేవరకొండ ఫౌండేషన్ తరుపున సహాయం చేస్తూ తన పెద్ద మనస్సును చాటుకుంటుంటాడు. అందులో భాగంగా సినిమా జర్నలిస్టుల సంక్షేమ నిధి కోసం ఐదు లక్షల రూపాయల సహాయం చేయడం జరిగింది. ఫిల్మ్ న్యూస్ కాస్టర్స్ అసోసియేషన్ అఫ్ ఎలక్ట్రానిక్ మీడియా(FNAEM) కు దేవరకొండ సహాయం చేసాడు. ఈ డబ్బును హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు ఇతర అవసరాలకు వినియోగించనున్నారు.

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ తాను సహాయం చేయడం చాల సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. గతంలో అల్లు అర్జున్ కూడా పది లక్షల రూపాయల సహాయం చేసిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నటించిన “వరల్డ్ ఫేమస్ లవర్” సినిమా గత వారమే విడుదలై డివైడ్ టాక్ తో నడుస్తుంది. ఈ సినిమా తరువాత ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. వరుస పెట్టి ప్లాప్ టాక్స్ మూటగట్టుకుంటున్న విజయ్ దేవరకొండ సినిమాలు పూరి జగన్నాధ్ సినిమాతో అయినా గాడిలో పడతాడేమో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •