అక్టోబర్ 21వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అన్ని పార్టీల నేతలు ఇప్పటికే ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 గురించి ముంబై నగరం మొత్తం బుర్ర కథలు వలే బీజేపీ పార్టీ సాధించిన ఘనత గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంది. మరోసారి మహారాష్ట్రలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందేమో అన్న రీతిలో దూసుకుపోతుంటే విపక్ష కూటమి కాంగ్రెస్ – ఎన్సీపీ మాత్రం ఒకడుగు ముందుకు, నాలుగడులు వెనక్కు అన్నట్లు తన ప్రచారాన్ని కొనసాగిస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఇంత వరకు ప్రచారపర్వంలో దిగకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులు కిందా మీద పడుతున్నారు. ఇక బీజేపీ నుంచి ప్రస్తుత సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ప్రచారంలో దూసుకుపోతున్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సగం ఖాళీ అయిందని, ఈనెల 24న ఫలితాలు వెల్లడైన తరువాత పూర్తిగా ఆ పార్టీ ఖాళీ అవుతుందని అయన జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవర్ ఎలాగైనా పార్టీని గాడిలో పెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.