బిగ్ బాస్ సీజన్-4 మూడవవారం పూర్తి చేసుకుంది. ఇక ఈ వారానికి మెహబూబ్‌, మోనాల్‌, కుమార్ సాయి, లాస్య, దేవి, అరియానా, హారికలు ఎలిమినేషన్‌కి ఎన్నికయ్యారు. వీరిలో లాస్య, మోనాల్ ను శనివారం సేవ్ చేసారు నాగార్జున. ఇక ఆదివారం ఎపిసోడ్ లో ఊహించని షాక్ తగిలింది. ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలవాలన్న ద్వేయంతో హౌస్ లోకి అడుగుపెట్టిన దేవి నాగవల్లి ఎలిమినేట్ అయ్యింది. దీంతో హౌస్ లోని కంటెస్టెంట్లతో పాటు వీక్షకులు షాక్ అయ్యారు.

ఇక సండే ఫండే అంటూ నాగార్జున హుషారుగా షో నడిపించాడు. సరదా గేమ్స్ తో ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను పుల్ ఎంటర్టైనర్ చేశారు. ఇక ఎలిమినేషన్ లో ఉన్న వారిలో మొదటిగా మెహబూబ్ ను సేవ్ చేసిన నాగ్.. ఆ తరువాత హారిక, అరియనాలను సేవ్ అయినట్లుగా ప్రకటించారు. ఇక చివరిగా కుమార్ సాయి, దేవి నాగవల్లి లు మిగిలారు.

ఇక రెండు బాక్సులు తెప్పించిన నాగార్జున.. ఆ బాక్సులలో చేయి ఉంచాలని వాటిలో గ్రీన్, రెడ్ కలర్ ఉన్నాయని.. గ్రీన్ కలర్ బాక్స్ లో చేయి పెట్టిన వారు సేవ్ అని, రెడ్ కలర్ బాక్స్ లో చేయి పెట్టిన వారు ఎలిమినేట్ అని నాగ్ ప్రకటించారు. ఇక కుమార్ సాయి కి గ్రీన్ కలర్ బాక్స్ రావడంతో సేవ్ అయ్యాడు. దేవి నాగవల్లికి రెడ్ కలర్ రావడంతో ఎలిమినేట్ గా ప్రకటించారు. ఇక దేవి ఎలిమినేట్ అవడంతో ఇంటిసభ్యులంతా భావోద్వేగానికి గురయ్యారు.

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా.. జిల్లాల వారీగా పాజిటివ్ కేసుల వివరాలు

ఎంత ప్రయత్నించినా హీరోయిన్ అనుష్కకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ దొరకలేదా?