బిగ్‌బాస్ హౌస్ నుండి మూడవ వారంలో దేవి నాగవల్లి ఎలిమినేట్ కావడం షాకింగ్ గా చెప్పవచ్చు. ఆమెను కావాలని ఎలిమినేట్ చేశారని.. ఆమె హౌస్ లో ఉంటే ఆట స్వరూపాన్ని మార్చి వేస్తుందని.. కావున ఓట్లు పడినా కూడా ఆమెను ఎలిమినేట్ చేసారని సోషల్ మీడియా వేదికగా ఆమె మద్దతుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకులు సైతం ఆమె ఎలిమినేషన్ కావడంతో షాక్ కు గురయ్యారు. బిగ్ బాస్ స్క్రిప్ట్ కు ఆమె అడ్డువస్తుందని కావాలనే ఆమెను బయటకి పంపించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ఈ నేపథ్యంలో ఈ ఊహాగానాలపై దేవి నాగవల్లి తాజాగా స్పందించారు. బిగ్ బాస్ షో ను నమ్మి వెళ్ళాను. నాకు ఓట్లు తక్కువ వచ్చాయి. అందుకే ఎలిమినేట్ అయ్యారని చెప్పారు. నేను కూడా అదే నమ్మను. కానీ నాకు బయటకి వచ్చాక ఎక్కువ ఓట్లు వచ్చాయని.. కావాలనే బయటకి పంపారని అంటున్నారు. నాకంటే వెనక ఉన్న వాళ్ళను వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం షాకింగ్ గా ఉంది.

ఇక మెహ‌బూబ్‌కు నా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని విన్నాను. అలాంటప్పుడు నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారన్నది అర్ధం కావడం లేదు. నా వల్ల స్క్రిప్ట్ మారిపోతుంది కాబట్టి వాళ్ళు అనుకున్న గేమ్ ప్లాన్ రావడం లేదు కావున ఇలా జరిగి ఉండొచ్చని.. ఎలిమినేషన్ తరువాత తాను చాలా షాకింగ్ లో ఉండి పోయానని దేవి నాగవల్లి వ్యాఖ్యలు చేశారు.

సీఎంను అందరూ ఆ ఇంటి బిడ్డ అనుకుంటున్నారు.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు..!

బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ఎలా సోకుతుందంటే..!

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!