దేవినేని అవినాష్ తెలుగుదేశం పార్టీని విడిచి వైసీపీలో చేరడంతో పాటు విజయవాడ తూర్పు పగ్గాలను దక్కించుకున్నాడు. తన తండ్రి దేవినేని నెహ్రూకు విజయవాడ తూర్పులో బలమైన క్యాడర్ ఉంది. దేవినేని నెహ్రు తన రాజకీయ జీతంలో విజయవాడ తూర్పుకు మంచి సేవలు అందించారు. వైసీపీ పార్టీకి తూర్పులో సరైన నాయకత్వం లేకపోవడంతో దేవినేని అవినాష్ రాకతో నాయకత్వ లోపం భర్తీ అయిందని చెప్పుకోవచ్చు.

దేవినేని అవినాష్ వైసీపీలో చేరడంతో అధికారం ఎక్కడ ఉంటే అక్కడకు అవినాష్ వెళతాడని, పార్టీలో చంద్రబాబు నాయుడు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, లోకేష్ బాబు సొంత తమ్ముడులా ఆదరించారని టీడీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై అవినాష్ మాట్లాడుతు తన భుజంపై చెయ్యి వేసినంత మాత్రాన తనకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదని, ప్రజల నిర్ణయాలను తెలుసుకొని నాయకులను కాపాడుకోవడమే నాయకుడు లక్ష్యమని, తెలుగుదేశం పార్టీలో సరైన గుర్తింపు దక్కడం లేదని, నాయకత్వ లోపం ఉందని చెబుతున్నారు.

తెలుగుదేశం పార్టీ సభ్యులు నా మీద ఆరోపణలు చేస్తునట్లు నేను వైసీపీలో చేరడానికి నా మీద ఏమైనా హత్యానేరారోపణల కేసులు ఉన్నాయా? భూకబ్జా కేసులు ఉన్నాయా? అక్రమాస్తుల కేసులు ఉన్నాయా? నాకేమైనా వ్యాపారాలు ఉన్నాయా? తన మీద ఉంది ఏవో చిన్న చితక బైక్ ర్యాలీ, ధర్నా కేసులు తప్ప ఏవి లేవని తెలియచేసారు. జగన్ మోహన్ రెడ్డి సీఎంగా సంక్షేమ పధకాలు ప్రజలందరికీ మాట ఇచ్చినట్లు నెరవేర్చడంతో పాటు అతని పరిపాలన నచ్చి తాను వైసీపీలో చేరానని చెప్పుకొచ్చారు.