ఏపీలో ప్రజలకు లాక్ డౌన్ నుండి పూర్తి ఉపశమనం లభించింది. లాక్ డౌన్-4 లో భాగంగా ప్రజలు ఏపీలోని ఏ ప్రాంతానికి అయిన వెళ్ళవచ్చు. తమ వాహనాలను కూడా తీసుకువెళ్లవచ్చని.. ఎలాంటి అనుమతి పత్రాలు చూపించవలసిన పని లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలియచేసారు. రాకపోకల విషయంలో ఎలాంటి అనుమతి అవసరం లేదని.. ఏపీలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి స్వఛ్చగా వెళ్ళవచ్చన్నారు.

ఇక కారులో ముగ్గురికి మించకుండా ప్రయాణించాలన్నారు. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడం తప్పనిసరి అని అన్నారు. రాష్ట్రాల్లోని జిల్లాల సరిహద్దుల్లో వాహనాలను ఆపవద్దని డీజీపీ ఎస్పీలకు సూచించారు. ఇక పక్కరాష్ట్రాల నుండి ఏపీలోకి రావాలంటే మాత్రం తప్పనిసరిగా అనుమతి ఉండాలి.

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు మృతి..!

ఏపీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర యాంకర్..!