మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తిరిగి తన సొంత గూటికి చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. గత కొంతకాలంగా ఆయన టీడీపీలోకి, జనసేనలోకి చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీకి మొగ్గు చూపారు. కానీ ఆయన రాజకీయ ప్రత్యర్థి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనుండటంతో దాడి ఆ ఆలోచనను విరమించుకున్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికలు ముందు వీరభద్రరావు టిడిపిని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికలలో దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ విశాఖ సిటీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఓటమి తర్వాత ఆయన వైసీపీని వీడారు. కాగా వీరభద్రరావు ఈ నెల 9వ తేదీన వైసీపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

dadi veerabadra rao
  •  
  •  
  •  
  •  
  •  
  •