భారతదేశం మొత్తం ఎక్కువ బాధిస్తున్న వ్యాధి ఏదైనా ఉందంటే అది మధుమేహమే. ఒక్కసారి మధుమేహం మన శరీరంలోకి వస్తే చచ్చేవరకు వదలదని చెబుతుంటారు. ఏదైనా శుభకార్యం వస్తే ముందుగా తీపి తినడం అలవాటు. కానీ ఈ డయాబెటిస్ వస్తే మన జీవితానికే తీపిని దూరం చేస్తుంది. అలాంటి మధుమేహానికి నివారణ లేదు. దానిని కంట్రోల్ చేసుకోవడం ఒక్కటే మార్గం. మధుమేహం వచ్చిన వారు తమకు పూర్తిగా రోగం తగ్గిపోయింది అన్నవారు లేరు. మన శరీరాన్ని కంట్రోల్ లో పెట్టుకొని జీవితంత అలా నెట్టుకురావడమే.

డయాబెటిస్ రావడానికి ముఖ్యకారణాలు స్ట్రెస్, పోషకాహార లోపం, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం ఇలా చాల రకాలుగా డయాబెటిస్ మన శరీరంలోకి అంటురోగంలా వచ్చి మనల్ని పీక్కుతింటుంది. మరింత దారుణమైన పరిస్థితులు ఏమిటంటే ఈమధ్య పుట్టే పిల్లలో కూడా షుగర్ వ్యాధి వస్తుందని తెలియచేస్తున్నారు. డయాబెటిస్ వస్తుందేమో అని భయం లేకుండా ముందుగానే కొన్ని ఆహారపు అలవాట్లను చేసుకుంటే, కొన్నింటిని వదిలివేస్తే డయాబెటిస్ బారి నుంచి బయటపడవచ్చు.

దాల్చిన చెక్క బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. కాఫ్య్, బ్రేడ్ పై దాల్చిన చెక్క పొడి చల్లుకొని తినాలి.

స్ట్రాబెర్రీస్ తినడం వాళ్ళ శరీరంలో ప్రోటీన్ ను యాక్టీవ్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అరికడుతుంది.

పసుపులో ఉండే కర్యుమిన్ డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది.

బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి మెంతులు బాగా ఉపయోగపడతాయి. ఒక టీ స్పూన్ మెంతిపొడి తీసుకొని, ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో కలుపుకొని ప్రతి రోజు తీసుకుంటే బ్లడ్ సుగర్స్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

మనం జ్యూస్ లు తీసుకోవడం కన్నా ముఖ్యంగా పండ్లను నేరుగా తీసుకోవడం కూడా ఉత్తమమైనది. యాపిల్ మరియు ఆరంజ్ ఫ్రూట్ ను ఎక్కువగా తీసుకోవాలి.

శరీరం డి హైడ్రాషన్ కాకుండా ఎక్కువగా నీరు తాగడం వలన కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •