ఐదురోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఓ రైతుకు వజ్రం దొరకడంతో దాని గురించి తీవ్రంగా ప్రచారం జరుగుతుంది. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో బేతాపల్లి గ్రామంలో ఓ రైతుకు కోటి రూపాయల వజ్రం దొరికింది. బేతాపల్లి గ్రామ శివారులో ఊటకల్లుకువెళ్లే దారిలో వ్యవసాయ భూములున్నాయి. ఈ మధ్య కురిసిన వర్షానికి భూమి పదును కావడంతో ఆ రైతు సేద్యం పనులు ప్రారంభించాడు. గుంటకతో భూమిని దున్నుతున్న సమయంలో ఓ వజ్రం బయట పడింది.

అయితే గ్రామంలోని ఇద్దరు మధ్యవర్తి వ్యక్తులతో కలసి ఆ వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలిలో ఆ వజ్రం అమ్మే ధర విషయంలో తేడా వచ్చింది. దీంతో గుత్తిలోని ఆర్‌ఎస్‌లోని ఓ వ్యాపారికి 30 లక్షలకు అమ్మినట్లు తెలుస్తుంది. అయితే ఆ వజ్రం ధర కోటి పైనే ఉంటుందని.. కానీ మధ్యవర్తులు వ్యాపారితో కుమ్కక్కై 30 లక్షలే ఇచ్చినట్లు చర్చ జరుగుతుంది.

ఇక ఈ వజ్రం విషయం గ్రామంలో తీవ్రంగా ప్రచారం కావడంతో రెవెన్యూ అధికారుల చెవిన పడింది. దీంతో పోలీసులు శుక్రవారం విచారణ చేశారు. ఇక వజ్రం దొరికిన రైతు అందుబాటులో లేకపోవడంతో అతని కుటుంబ సభ్యులను పిలిచి విచారించారు. ఇక వజ్రం కొనుగోలు చేసిన వ్యాపారిని, మధ్యవర్తులను కూడా తహసీల్దార్ బ్రహ్మయ్య, సీఐ రాజశేఖర్‌రెడ్డి పిలిపించి వారితో మాట్లాడారు. అయితే వజ్రం దొరికిందని కుటుంబ సభ్యులు ఒప్పుకోగా, వ్యాపారి మాత్రం తాను అసలు వజ్రాన్ని కొనుగోలు చేయలేదని చెబుతున్నాడు. ఇక ఈ వజ్రం గురించి పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఉన్నారు అధికారులు.

అతడు పక్కన ఉంటే ఎలాంటి టెన్షన్లు ఉండవంటున్న ఛార్మి..!

ఏపీ సీఎం జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బుల్లితెర యాంకర్..!