సినిమా స్టార్ పెళ్లంటే అంగరంగ వైభవంగా చేయడానికి అతడి తల్లి తండ్రులు ఆలోచిస్తుంటారు. అతడు కూడా తన పెళ్లి ఘనంగా చేసుకోవడంతో పాటు నలుగురు నిర్మాతలను, నలుగురు మంచి దర్శకులను ఆహ్వానించి ఒక రెండు, మూడు సినిమాలు లైన్ లో పెట్టాలని ఆలోచిస్తుంటారు. కానీ కన్నడ యువ నటుడు చేతన్ మాత్రం తన పెళ్లి చాలా సింపుల్ గా వినోబా బావే అనే ఆశ్రమంలో నిరాడంబరంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించి అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలనుకున్న వారి తల్లితండ్రుల కోర్కెను తిరస్కరించాడు.

చేతన్ పెళ్లి చేసుకోబోయే మేఘ అనే మహిళ కూడా సామజిక ఉద్యమకారిని కావడం విశేషం. ఇక చేతన్ తన పెళ్లి కార్డుని ప్రత్యేకంగా రూపొందించి అందులో కొన్ని విత్తనాలను అంటించి అందరకి తన పెళ్లి కార్డులు ఇస్తున్నాడు. ఈ పెళ్లి కార్డులో అంటించిన విత్తనాలకు సంబంధించిన ఒక ప్రత్యేక విభాగాన్ని భూమిలో నాటి రోజు నీరు పోస్తే చాలని మొక్కలు పెరిగి పెద్దవై పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుని అందిస్తాయని చేతన్ పిలుపునిస్తున్నారు. ఈ యువ హీరో ఆలోచన పట్ల చాల మంది అతడిని అభినందించడమే కాక ఆ పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.