ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మంత్ ఎండ్ సేల్స్, ఇయర్ ఎండ్ సేల్స్, పండుగ ఆఫర్స్ అంటూ బొనాంజా సేల్స్ పెడుతుంది. ఆ సమయంలో అమెజాన్ కస్టమర్స్ తమకు నచ్చిన వస్తువుల కోసం ఎగబడుతుంటారు. అందులో భాగంగానే అమెజాన్ చేసిన ఒక చిన్న పొరపాటుతో అదిరిపోయే ఆఫర్స్ లో కస్టమర్స్ కొనుగోలు చేసారు.

అమెజాన్ ఎంత గొప్ప బొనాంజా ఆఫర్స్ ప్రకటించినా 40 నుంచి 50 శాతం మధ్యలోనే ఆఫర్స్ పెడుతుంది. కానీ అమెజాన్ సంస్థ చేసిన చిన్న పొరపాటుతో బారి మూల్యం చెల్లిచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా 9 లక్షల రూపాయలు విలువైన బ్రాండెడ్ కెమెరా 6500 రూపాయలకే వస్తున్నట్లు ఉండటంతో కస్టమర్స్ ఎగబడ్డారు. అమెజాన్ ప్రైమ్ డే ఆఫర్ లో మరొక అత్యాధునికమైన కెమేరాపై కూడా ఇలాంటి ఆఫర్ నే వచ్చింది. సోని ఏ6000 కెమెరాకు కూడా ఇదే గతి పట్టింది. దాదాపుగా నాలుగు లక్షల రూపాయలు ఉన్న ఈ కెమెరా కూడా 6500 రూపాయలకు రావడంతో కస్టమర్స్ అత్యంత చవకగా దక్కించుకున్నారు. కెమెరా కొన్న తరువాత నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టడంతో అమెజాన్ తాము చేసిన పొరపాటుని గమనించి అప్పటికీ బుకై ఆర్డర్స్ ఇవ్వని వాటిని రద్దు చేసి కొంత భారాన్ని తగ్గించుకుంది.


Tags: Amazon


  •  
  •  
  •  
  •  
  •  
  •