గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో మల్టీస్టారర్ తీసిన నిర్మాత దిల్ రాజు. వెంకటేష్ ,మహేష్ బాబు హీరోలుగా నటించిన ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నారు దిల్ రాజు. ‘ఎవడు’ సినిమాతో హిట్ కొట్టిన వెంకట్ రాంజీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు.

వెంకట్ రాంజీ చెప్పిన కథ దిల్ రాజుకు బాగా నచ్చడంతో ఈ సినిమా ఒప్పుకున్నారు. ఈ సినిమా ఓ మల్టీస్టార్ సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ మూవీలో ఒక హీరోగా మెగా హీరో నటించే అవకాశాలు ఉన్నాయట. మరో హీరోను కూడా సెలెక్ట్ చేసుకుని అప్పుడు చిత్ర పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారట.

  •  
  •  
  •  
  •  
  •  
  •