దిల్ రాజు తెలుగు ఇండస్ట్రీలో విజయవంతమైన నిర్మాతగానే కాకుండా టాలెంటెడ్ డిస్ట్రిబ్యూటర్ కూడా. తాను పెట్టిన పెట్టుబడికి మరో రూపాయి వస్తుందంటేనే ఇన్వెస్ట్ మెంట్ చేస్తాడు. కానీ దిల్ రాజు అంచనాలన్ని తలకిందులై పూరి జగన్నాధ్ తనయుడి ఆకాష్ హీరోగా వచ్చిన “మెహబూబా” సినిమా పెద్ద దెబ్బ వేసింది. పూరి జగన్ తన కొడుకుతో తీసిన సినిమాను దిల్ రాజుకి ముందుగానే వీక్షించడానికి ప్రత్యేక షో ఏర్పాటు చేసాడు. “మెహబూబా” సినిమా చూసి నచ్చడం వలనే తాను థియేట్రికల్ రైట్స్ తీసుకుంటున్నానని అనౌన్స్ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేసాడు. ఆ సినిమా దెబ్బకు దిల్ రాజుకి అపారమైన నష్టం వచ్చింది. 

కట్ చేస్తే  ఆ సినిమా తరువాత పూరి జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్” పేరుతో హీరో రామ్ తో ఒక సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఒకసారి చూడమని పూరి జగన్నాధ్… దిల్ రాజుని కోరాడట. కానీ దిల్ రాజు తాను చాల బిజీగా ఉన్నానని తాను ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ చేసేంత సమయం కూడా లేదని సెలవిచ్చాడట. పూరి మాత్రం వదలకుండా కనీసం సినిమా ఒక్కసారి చూడమని చెప్పినా దిల్ రాజు అందుకు కూడా తిరస్కరించాడట.

దిల్ రాజుకి “మెహబూబా” సినిమా సమయంలో పడిన దెబ్బను ఇంకా మర్చిపోయినట్లు లేడని… పూరి జగన్నాధ్ సినిమా చూపించి తన చేత డిస్ట్రిబ్యూషన్ చేయించినా చేయిస్తాడని… మొహమాటానికి పోయి ఇబ్బందులు ఎదుర్కొనడం ఎందుకని పూరీని వదిలించుకున్నాడట. డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయినా ఇంత వరకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోకపోవడంతో పూరి కొంత టెన్షన్ కు గురవుతున్నాడని ఫిల్మ్ వర్గాల బోగట్టా. మరో 10 రోజులలో సినిమా విడుదల కానుండటంతో హీరో రామ్ పెదనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిశోర్ తో మంతనాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. 
  •  
  •  
  •  
  •  
  •  
  •