బోయపాటి ఎప్పుడైతే రామ్ చరణ్ హీరోగా “వినయ విధేయ రామ” లాంటి అట్టర్ ప్లాప్ మూవీ తీసాడో… ఆ తరువాత బోయపాటి గడప తొక్కాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఈ తరుణంలో అల్లు అరవింద్ గత మూడు రోజుల క్రితం ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా వస్తున్న “గుణ 369” ట్రైలర్ లంచ్ ఈవెంట్ లో ఒక కీలక ప్రకటన చేశారు. తనకు సరైనోడు లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన బోయపాటితో త్వరలో ఒక సినిమాను నిర్మించనున్నానని చెప్పి బోయపాటిని కొంత సంతృప్తి పరిచాడనే చెప్పుకోవచ్చు.

కానీ అల్లు అరవింద్ చెప్పిన మాటలకు, బోయపాటి దర్శకత్వంలో ఎప్పుడు సినిమా నిర్మిస్తాడన్న దానికి పొంతన కుదరడం లేదు. అల్లు అర్జున్ తో ఏమైనా సినిమాను ప్లాన్ చేసుకుంటున్నారా అంటే… కొద్ది రోజుల క్రితమే అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదహ్కు వెళ్ళింది. అల్లు అర్జున్ దాదాపుగా ఆరేడు నెలలు ఖాళీగా ఉండడు. చిరంజీవిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నా చిరంజీవి తన కొడుకుతో తీసిన “వినయ విధేయ రామ” రిజల్ట్ చూసిన తరువాత ఆ దరిదాపులలోకి వెళ్ళడు. చిరంజీవి కూడా “సైరా” సినిమా ముగించుకొని కొరటాల సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇక బయట వారితో సినిమా తీయాలంటే బోయపాటి చెప్పే బడ్జెట్ మాత్రం 70 కోట్ల లెక్కలో ఉంటుంది, రెమ్యూనరేషన్ కూడా అదే రేంజిలో తీసుకుంటాడు. ఒకవేళ సినిమా నిర్మిస్తే దాని పరిస్థితి అయితే హిట్ లేకపోతే డిజాస్టర్… యావరేజ్ లాంటి సినిమాల పరిస్థితి ఉండదు. ఇంకా అంతకన్నా ముందు అల్లు అరవింద్ తో వ్యవహారం స్టోరీ విషయంలో ఎంతకూ తెగదు. అల్లు అరవింద్ కోటరీ చాల నిక్కచ్చిగా స్టోరీపై పట్టు సాధించి అప్పుడు షూటింగ్ కు వెళతారు. అందుకే అల్లు అరవింద్ నిర్మించే సినిమాలు మంచి హిట్స్ సాధిస్తాయి. ఇవన్ని జరగాలంటే మరో ఏడాది పైగానే వెయిట్ చేయాలి. ఆ తరువాత ఏమైనా తేడా వస్తే మొదటికే మోసం వస్తుంది. ఇన్ని పరిణామాల మధ్య తనతో సినిమా తీయడానికి ఎవ్వరు ముందుకు రావడం లేదని అల్లు అరవింద్ తీస్తానని చెప్పిన సినిమా కోసం వెయిట్ చేస్తాడా లేక బోయపాటి తన ప్రయత్నాలలో ఉంటాడా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.   
  •  
  •  
  •  
  •  
  •  
  •