భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతిరోజు పండగే వంటి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లను తీసిన దర్శకుడు మారుతీ మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరకెక్కించబోతున్నాడు. రామ్ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు మారుతి. ఇక రామ్ కోసం మారుతి ఓ వెరైటీ కాన్సెప్ట్ కథను రాసుకున్నాడట. అయితే ఆ కథ కాకుండా ఫ్యామిలీ కథతో సినిమా తీద్దామని రామ్ చెప్పడంతో మరో ఫ్యామిలీ స్టోరీతో రానున్నాడు మారుతి.

ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్.. ఆ సినిమా తరువాత ‘రెడ్’ సినిమా చేస్తున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే మారుతి సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారంగా ఉంది.