‘ఆలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది డైరెక్టర్ నందిని రెడ్డి. ఆ తర్వాత ఆమె తీసిన సినిమాలు అంతగా విజయవంతం కాలేకపోయాయి. ఈ సంవత్సరం సమంతతో తీసిన ‘ఓ బేబీ’ సినిమా మంచి హిట్ సాధించింది. ఇక దసరా పండగ సందర్భంగా నందిని రెడ్డి తన తర్వాత ప్రాజెక్ట్ ను ఆఫీసియల్ గా ప్రకటించింది.

అశ్వినీదత్ నిర్మాణంలో తన కొత్త ప్రాజెక్ట్ ఉంటుందని ప్రకటించిన నందిని రెడ్డి.. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాను అని చెప్పింది. మిక్కీ జె మేయర్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు ప్రముఖ రచయత లక్ష్మి భూపాల్ మాటలు అందించబోతున్నాడు.