సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అన్ని కార్యక్రమాలు చకచకా ముగించుకొని విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విశేషాల గురించి సురేందర్ రెడ్డి మాటలలో 

1800 నుంచి 1846 మధ్య కాలంలో  రెబలియన్ గా తన తిరుగుబాటును అతనికి సొంతగా సైన్యం లేకపోయినా ప్రజల మద్దతుతో బ్రిటిష్ వారిపై ఎలా నరసింహారెడ్డి తిరుగుబాటు చేసాడో ఈ సినిమాలో ప్రేక్షకులు చూడనున్నారు.

చిరంజీవి, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబచ్చన్ లాంటి బడా హీరోలతో ఒకేసారి 270 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ చేస్తుందుకు చాల అందంగా ఉందని అన్నారు

తెల్లవారు జామున షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నా సమయానికి అమితాబచ్చన్, చిరంజీవి ఇద్దరు వచ్చి సెట్ కు సమయానికి వచ్చి నటన పట్ల వారు చూపించే శ్రద్ధ అమోఘం అని సురేందర్ రెడ్డి తెలియచేస్తున్నారు.

నేను సినిమా చేస్తున్నప్పుడు అమితాబచ్చన్ గారిలో గమనించింది అతను దర్శకుడి మాటనే ఫాలో అవుతూ అంకితభావంతో పని చేయడమే కాకుండా దర్శకుడు తన సినిమాను ఎలా చిత్రీకరిస్తున్నాడో గమనిస్తుంటారు. 

కచ్చితంగా ‘సైరా’ సినిమా పాన్ ఇండియా సినిమా అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, భారతదేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి నరసింహారెడ్డి అప్పట్లో అయన చేసిన ప్రయత్నాలు చాల అద్భుతంగా ఉంటాయని, సినిమాలో అన్ని ఎమోషన్స్ చక్కగా కుదిరాయని అన్నారు.

బడ్జెట్ గురించి నిర్మాత రామ్ చరణ్ ఎటువంటి ఆలోచనలు లేకుండా ‘పాన్ ఇండియా’ సినిమాగా తయారుచేయడానికి తన వంతు కృషి చేసాడని అన్నారు. దాదాపుగా ఐదు బాషలలో విడుదలవుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకొని నర్సింహారెడ్డి గురించి దేశం గర్వించేలా మాట్లాడుకుంటారని సురేందర్ రెడ్డి అన్నారు.

ఈ సినిమాను రామ్ చరణ్ తేజ్ ‘కొణిదెల ప్రొడక్షన్స్’పై నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళంతో పాటు హిందీలో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల చేయాలని భావిస్తున్నా, ఆరోజు బాలీవుడ్ లో హృతిక్ రోషన్, టైగర్ ష్రఫ్ నటించిన ‘వార్’ సినిమా ఉండటంతో మరో వారో ఆగి విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయవలసి ఉంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •