సుమంత్ హీరోగా నటించిన ‘సత్యం’ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన సూర్యకిరణ్.. మొదటి సినిమాతోనే మంచి హిట్ సాధించారు. ఆ తరువాత పలు సినిమాలకు దర్శకత్వం వహించిన అవి అనుకున్నంత విజయం సాధించలేదు. ప్రస్తుతం తెలుగు ‘బిగ్ బాస్ 4’లో పాల్గొన్న ఆయన మొదటి వారంలోనే ఎలిమినేషన్ అవ్వడం ఆశ్చర్యం కలిగించింది.

ఈ విషయంపై తాజాగా స్పందించారు సూర్యకిరణ్. తాను బిగ్ బాస్ హౌస్ లో కనీసం నాలుగు వారాలు ఉండాలని వెళ్లానని.. అనుకోకుండా మొదటి వారమే బయటకి రావాల్సి వచ్చిందని అన్నారు. నర్సరీ, ఫస్ట్ క్లాస్ స్కూల్లో టీచర్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో బిగ్ బాస్ నాకు అలా అనిపించింది. అందరూ హరిభరిగా మాట్లాడుతున్నారు. రకరకాల మైండ్ సెట్ ఉన్న ఇంత మందితో కలసి ఉంటానని నేను ఎప్పుడు అనుకోలేదని.. నాకు ప్రతిరోజు చాలా భారంగా గడిచిందన్నారు. ఒక వారం రోజుల పాటు బిగ్ బాస్ కొత్త అనుభూతిని పంచిందని అన్నారు.

ఇక నేను ‘సత్యం’ సినిమా తరువాత కొన్ని సినిమాలు తీశాను. అయితే ఆ తరువాత నేను కొన్ని కారణాల వల్ల నేను చెన్నై వెళ్ళైపోయాను. ఆ సమయంలో నేను చనిపోయానని న్యూస్ వచ్చింది.. ఏంటి ఇలాంటి న్యూస్ వచ్చిందేంటి అనుకుని ఓ సినిమా చేద్దామని నిర్ణయించుకున్నాను. ఉగాదికి సినిమా షూటింగ్ మొదలు పెడదామని నిర్ణయించుకున్నాక కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పడడం వల్ల సినిమా వాయిదా పడింది. ఈలోగా బిగ్ బాస్ ఆఫర్ రావడం వల్ల ఒప్పుకున్నాను. ఇక ఈ బిగ్ బాస్ ద్వారా రీఎంట్రీ అయితే నేను అందరికి తెలుస్తాను కదా అని ఈ షోలో పాల్గొన్నానని సూర్యకిరణ్ తన అనుభవాలని తెలియచేసాడు.

పవన్ కళ్యాణ్ సినిమాకు హీరో రామ్ టైటిల్..!

ప్రముఖ ఓటిటిలో ‘నాంది’ మూవీ..!

గోవా ట్రిప్ లో ప్రియుడితో కలిసి నయన్ ఎంజాయ్..!