నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతూనే ఉన్నాయి. తనను పిలవకుండా భూములు పంచుకుంటున్నారా అని బాలకృష్ణ కామెంట్ చేయడంపై ఇండస్ట్రీలో ఉన్న విభేదాలు మరోసారి తెరమీదకు వచ్చాయి. ఇక బాలకృష్ణకు కొందరు సపోర్టుగా మాట్లాడుతుంటే మరి కొందరు విమర్శిస్తున్నారు.

ఇక తాజాగా ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు తేజ స్పందించారు. ఇండస్ట్రీకి అందరు సమానమేనన్న తేజా.. బాలకృష్ణను కూడా పెద్దల మీటింగుకు పిలవాల్సిందన్నారు. ఇటీవల ఇండస్ట్రీ మీటింగ్ లో ఏం జరిగిందో తెలియదని.. కానీ తప్పకుండా చిరంజీవితో పాటు బాలకృష్ణను కూడా పిలవాలన్నారు. వాళ్లనే కాదు పరిశ్రమకు పిల్లర్ గా ఉన్న వారందరిని పిలవాల్సిన బాధ్యత ఉందన్నారు.

ఇక్కడ ఎవరిని చిన్న చూపు చూడకుండదన్న తేజా.. ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదని వ్యాఖ్యలు చేసాడు. మొత్తానికి ఇండస్ట్రీ మీటింగుకు బాలకృష్ణను పిలవకుండా తప్పుచేశారన్నారు తేజ.

తుపాను ప్రభావంతో రన్‌వేపై జారిన విమానం..!

ఏనుగును చంపిన ఘటనపై మండిపడ్డ మేనకా గాంధీ