మూర్ఛ రోగం ఉన్నవారు ఒక్కసారిగా ఉన్నట్లు ఉండి, అలా పడిపోయి కొట్టుకుంటుంటారు. ఆ క్షణంలో పక్కన ఎవరు లేకపోతే చాల ప్రమాదకరం, ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఈ మూర్ఛ రోగం ముందుగా కనిపెట్టడంపై శాస్త్రవేత్తలు ఒక పరికరాన్ని కనుగొన్నారట. ఈ పరికరం వలన ప్రాణాపాయం నుంచి రక్షణ కూడా పొందవచ్చు.

మనం చేతికి తొడుక్కునే కంకణంలాగా ఉండే ఆ పరికరాన్ని మన చేతికి పెట్టుకుంటే సత్ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. తాము దాదాపుగా 28 మంది రోగులపై పరీక్షలు చేయగా మూర్ఛ వచ్చే ముందు ఆ యంత్రం ఒక అలారం మోగిస్తుందని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. ఈ యంత్రం ద్వారా 96 శాతం సందర్భాలలో ముందస్తు హెచ్చరికలను గుర్తించి రోగిని ముందుగానే కాపాడవచ్చని చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం, కదలికల ద్వారా ఈ యంత్రం పనిచేస్తూ ముందుగానే రోగాన్ని గుర్తిస్తుందని చెబుతున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •