రవితేజ నటించిన గత మూడు సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం రవితేజ ‘ఎక్కడికిపోతావు చిన్నవాడ’ ఫెమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ అనే చిత్రంలో నటించనున్నాడు. సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాబా నటేష్ , పాయల్ రాజ్ పుత్ కథానాయికలుగా నటించనున్నారు. వీరితో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతుంది. ఆ హీరోయిన్ పేరును త్వరలోనే ప్రకటిస్తారు. ఇక ఈ చిత్రం యొక్క షూటింగ్ మార్చి 4 నుండి హైదరాబాద్ లో జరుగనుంది. ఎలాగైనా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసితో ఉన్నాడు రవితేజ. కాగా రవి తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.
  •  
  •  
  •  
  •  
  •  
  •