రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఈమధ్య కాలంలో హిట్ అన్న మాటే వినలేదు. అతడు వారానికో, నెలకో ఒక సినిమా విడుదల చేసిన ప్రతి సినిమా అట్టర్ ప్లాప్ కాడవమే. కానీ అతడి సినిమాలకు సంబంధించి ముందుగా విడుదల చేసే ట్రైలర్ మాత్రం సూపర్ డూపర్ హిట్ గా నిలుస్తాయి. ఈ ట్రైలర్ చూసే సినీ అభిమానులు రామ్ గోపాల్ వర్మ ఏదో మ్యాజిక్ చేస్తున్నాడని అతడి సినిమా కోసం మొదటి రోజు అర్రులు చాస్తారు. ప్రతి సినిమాకు అతడి మాయలో పడి మోసపోవడమే తప్ప ఒక్క సినిమా కూడా రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల నిన్ఱాయ్నికి అనుగుణంగా సినిమా అయితే తీయలేదు.

ఈరోజు ఉదయం ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆనంద్ చంద్ర డైరెక్షన్ లో “దిశా ఎన్ కౌంటర్” అఫిషియల్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తే దిశా అనే అమ్మాయిని నలుగురు దుర్మార్గులు ఎలా ఔటర్ రింగ్ రోడ్ పై కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి ఎలా చంపారో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. అప్పట్లో దిశా అనే యువతిని అత్యాచారం చేసి చంపేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. దీనితో అప్పట్లో తెలంగాణ పోలీసులు ఆ నలుగురిని ఎన్ కౌంటర్ చేసి చంపేశారు. దాని ఆధారంగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీశారు. ఈ సినిమాలో కూడా ఎన్ కౌంటర్ గట్రా మొత్తం విషయాలను కళ్ళకు కట్టినట్లు ఆర్జీవీ చూపించే ప్రయత్నమైతే చేశారు. కానీ ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో మాత్రం కొన్ని రోజులు ఆగితే తెలిసిపోతుంది.