ఈమధ్య బ్యాంకుల విలీన ప్రక్రియ గురించి కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తెలియచేశారు. ఇలా బ్యాంకులను విలీనం చేయడం వలన ఉద్యోగస్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని భరోసా కూడా ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి మరొక న్యూస్ చెక్కర్లు కొట్టడంతో ఆర్బీఐ అలెర్ట్ అయింది. కొన్ని కమర్షియల్ బ్యాంకులను మూసి వేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆర్బీఐ కండించింది.

బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని, ఉత్తమమైన సేవలను అందించేందుకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను బలోపేతం చేస్తామని ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలియచేశారు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆర్బీఐ తన ట్విట్టర్ లో పేర్కొంది.