ఏపీలో వరద ఉదృతి కారణంగానే ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు వైసీపీ నేత, ఎస్వీబీసీ చైర్మన్ పృద్వి రాజ్. ఇసుక రిచ్ లలో ఉన్న వాస్తవ పరిస్థితులను ఆయన సోమవారం పరిశీలించి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మూడు నెలల నుండి నీటితో ఇసుక రిచ్ లన్ని మునిగి ఉన్నాయన్నారు. వరదల కారణంగానే ఇసుక కొరత ఏర్పడిందని ప్రజలందరికి తెలుసని.. కానీ దీనిపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కావాలని రాద్ధాంతం చేస్తున్నారన్నారు.

ఏ సమస్య దొరకక కేవలం రాజకీయం కోసమే పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్, చంద్రబాబు దీక్షలు చేశారని పృద్వి ఆరోపించారు. నిబంధనలు అతిక్రమించి తెలుగుదేశం నేతలు టీడీపీ హయాంలో ఇసుకను దోసుకున్నారని ఆయన అన్నారు. టీడీపీ నేతలు ఇసుక ర్యాంపులకు రోడ్లు వేశారు కానీ, గ్రామాల్లో ప్రజలకు కాదన్నారు. ఈ దోపిడీని భరించలేక తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ప్రజలు ఇచ్చారని.. ఇసుక కొరతకు ముమ్మాటికీ గత తెలుగుదేశం ప్రభుత్వమే కారణమన్నారు.