తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పట్లో అభిరుచిగల నిర్మాతలలో ఒకరిగా మంచి పేరు సంపాదించారు నిర్మాత దొరస్వామి రాజు. అతను నిర్మించిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. అలాంటి దొరస్వామి రాజు ఒక మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ పలు విషయాలు దివంగత ఎన్టీఆర్ గురించి వెల్లడించారు. ఎన్టీఆర్ చాలా పొదుపు మనిషని అంతటి పొదుపు మనిషిని తాను ఎక్కడ చూడలేదని చెప్పుకొచ్చారు.

తాను ఎన్టీఆర్ తో సినిమాలు నిర్మించలేదుగాని అతని సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేసానని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ను కలవలనంటే తాను ఉదయం ఐదు గంటలకు అతడి ఇంటి దగ్గరకు వెళ్ళేవాడినని, ఎన్టీఆర్ ప్రతి రోజు ఉదయం మూడు గంటలకే నిద్ర లేచి అన్ని పనులు ముగించుకొని ఐదు గంటలకు అతడిని కలవడానికి వచ్చే వారితో చర్చలు చేసేవారని అన్నారు.

నేను ఒకరోజు ఉదయం ఐదు గంటలకు వారి ఇంటికి వెళితే అతడి భార్య బసవతారకంతో ఈరోజు వాడవాల్సినవి ఏమిటి, ఇంటిలోకి ఏమేమి అవసరం లాంటి వాటికి సంబంధించి డబ్బులు ఇవ్వడం జరిగింది. తాను వారిద్దరి మాటలు అయిపోయాక ఎన్టీఆర్ గారితో ప్రతి రోజు ఇవ్వడం దేనికని, నెల రోజులకు సరిపడిన డబ్బులు ఒకేసారి ఇస్తే సరిపోతుంది కదా అంటే, రాజు గారు మీరు కుర్రవాళ్ళు మీకేమి తెలియదు, డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, పొదుపు పాటించడం ఏరోజుకి ఆరోజు లెక్కలు చూసుకోవడం మంచిదని నాకు హితబోధ చేశారు. అతను డబ్బు విషయంలో ఎంత కచ్చితంగా ఉంటారో అప్పుడే తెలిసిందని, తాను కూడా ఎన్టీఆర్ ను చూసి చాలా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు

  •  
  •  
  •  
  •  
  •  
  •