మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ద్రుష్టి రీమేక్ లపై పడింది. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ ‘లుసిపెర్’ హక్కులను దక్కించుకున్న చరణ్.. మరో సినిమా రీమేక్ హక్కులను కూడా దక్కించుకున్నాడు. ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సూపర్ హిట్ మలయాళ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నాడు. ఈ రెండు సినిమాలను కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నాడు చరణ్.

ఇక ‘లుసిపెర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా కొరటాల శివ సినిమా తరువాత సెట్స్ మీదకు వెళ్లబోతుందట. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ను మెగా హీరోతో తీస్తాడా లేక బయట హీరోతో తీస్తాడా వేచి చూడాలి.

అసలు ‘డ్రైవింగ్ లైసెన్స్’ కథ విషయానికి వస్తే.. ఒక టాప్ హీరోకి తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయుంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాగా మోటార్ వెహికల్ ఆఫీసర్ గా తన వీరాభిమాని ఉంటాడట. అయితే అనుకోని సంఘటనల వల్ల వారిద్దరూ భద్ర శత్రువులుగా మారిపోతారు. ఇక అక్కడి నుండి సినిమా ఏమైంది అనేది అసలు కథ.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కూడా నటిస్తున్నాడు చరణ్.

  •  
  •  
  •  
  •  
  •  
  •