దసరా అనే పేరుని కాస్త అటు ఇటు చేస్తే “సరదా” అవుతుంది. పండుగలన్నింటిలో చాల విశిష్టమైన పండుగ దసరా పండుగ. దసరా పండుగను విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారందరూ దసరాను పది రోజులు జరుపుకుంటారు, ముందు తొమ్మిది రోజులు నవరాత్రులలో దుర్గా దేవికి పూజలు చేస్తారు. ఇక చివరి రోజైన విజయదశమి రోజును దసరా పండుగగా జరుపుకుంటుంటారు. దసరా అనే పేరు ఎలా వాడుకలోకి వచ్చిందంటే “దశ హర” అంటే పది రోజుల పండుగ అనే అర్ధంతో వాడుకలోకి వచ్చింది

చరిత్ర చెబుతున్నదేమిటంటే శ్రీ రామచంద్రుడు రావణాసురినిపై గెలిచిన సందర్భంగా దసరా పండుగను చేసుకుంటారు. మరొక కథ ప్రకారం పాండవులు వనవాసానికి నుంచి తిరిగి వెళుతూ జమ్మి చెట్టు మీద ఉనన్ తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజని, ఈ సందర్భంగా రవాణా వధతో పాటు, జమ్మి ఆకుల పూజ చేయడం జరుగుతుంది.

ఆదిత్య హృదయం మన కార్యసిద్ధికి ఎలా ఉపయోగపడుతుంది

బ్రహ్మదేవుని వరాల వలన గర్వితుడై మహిషాసురుడు దేవతల తోనే యుద్ధానికి తలపడి వారిని ఓడించి ఇంద్రుని పదవిని లాక్కుంటాడు. ఈ పరిణామంతో దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా త్రిమూర్తుల తేజముతో ఒక స్త్రీ రూపం జన్మనిస్తుంది. శివుని తేజము ముఖముగా, విష్ణువు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగలి మూర్తిగా అవతరించి ఆమె 18 బాహువులను కలిగి ఉంది.

ఆమెకు శివుడి యొక్క శూలము, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణ దేవుడు పాశము, వ్రాహ్మదేవుడు అక్షమాల, కమండలం, హిమవంతుడు సింహమును వాహనముగా ఇచ్చారు. జగన్మాత అయిన దుర్గాదేవి, మహిషాసురుడనే రాక్షసుడిని సర్వ దేవతల ఆయుధములను సమకూర్చుకొని తొమ్మిది రాత్రులు అతడిపై యుద్ధం చేసి సంహరించడంతో పదవ రోజు ప్రజలంతా సంతోషంతో దసరా పండుగ జరుపుకుంటారు.

బతుకమ్మ పేరు ఎలా వచ్చింది, పండుగ చరిత్ర