కేంద్ర వైద్య ఆరోగశాఖ మంత్రి హర్షవర్ధన్ నోటి ఆరోగ్యం పట్ల ప్రజలకు అవగాహన కలిగించే దానిలో భాగంగా “ఈ- దంత్ సేవ్” పేరుతో రూపొందించిన వెబ్సైట్, మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ ద్వారా నోటికి సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా ఒక్క క్లిక్ తో మీ ముందు ఉంటుందని హర్షవర్ధన్ తెలియచేసారు. దంతవైద్య సేవలు అందించే సంస్థలు, దంత వైద్య కళాశాలల వివరాలను జీపీఆర్ఎస్ తో సహా యాప్ లో అందుబాటులో ఉంచారు.అంధుల కోసం బ్రెయిలీ బుక్ లెట్ ను మంత్రి ఆవిష్కరించడం జరిగింది.