ఈనాడు పత్రిక అంటే తెలుగుదేశం కరపత్రమన్న సంగతి జగమెరిగిన సత్యం. ఈనాడు పత్రిక యజమాని రామోజీరావు వ్యవహారశైలిపై కూడా సోషల్ మీడియాలో పుంఖాను పుంఖాలు వార్తలు ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ గా నెటిజన్స్ పోస్టులు చేస్తుంటారు. ఈనాడు పత్రికను అడ్డుపెట్టుకొని రామోజీరావు ఎన్టీఆర్ ను ఒక దేవుడన్నట్లు చూపించి ఎంతలా పైకి లేపి, అధికారంలోకి రావడానికి సహాయం చేసాడో… అదే ఎన్టీఆర్ ను ఈనాడు పత్రికలో ఒక ద్రోహిగా… స్త్రీ లోలుడుగా అత్యంత జుగుత్సాకరంగా ఆ రోజులలో కార్టూన్స్ వేసి ఎన్టీఆర్ చనిపోయే రోజులలో క్షోభకు గురి చేసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడవడంతో ప్రధాన పాత్ర పోషించాడు.

రామోజీరావు అలా చేయడానికి కూడా కారణం, తన దగ్గర కుక్కలా పడుండేవాడు కావాలి తప్ప…. తాను ఆ కుక్క చెప్పినట్లు వినేరకం కాదని తరువాత రోజులలో చెప్పకనే చెప్పాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆశీనులైన తరువాత ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి పెద్ద నిర్ణయం తీసుకున్నా ముందు రామోజీరావుకు వివరించి ఆ తరువాత అతడు రైట్ రైట్ అంటేనే ముందుకు వెళ్లే రకం. చంద్రబాబు నాయుడుకి కూడా పత్రికలు ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తాయో… ఎలా నిలబెడతాయి తెలియడంతో ఇలాంటి వ్యవహారం నచ్చినా నచ్చకపోయినా రామోజీరావు చెప్పినట్లు చేస్తుంటారని చాలా మంది వ్యాక్యనాలు చేస్తుంటారు.

ఈనాడు పత్రిక ఎప్పుడు టీడీపీకి ఆపద వచ్చినా ముందు వరుసలో ఉండటానికి ఎలాంటి మొహమాట పడదు. గుంటూరుకు చెందిన 65 ఏళ్ళ రంగనాయకమ్మ అనే వృద్ధురాలు ప్రభుత్వం గురించి వ్యతిరేక పోస్టులు పెట్టడంతో ఆమెకు సిఐడి నోటీసులు ఇచ్చారు. దీనిని ఈరోజు హైలెట్ చేసి చూపించి ఆమె చేసింది తప్పుకాదని, ఒక వృద్ధ మహిళను ఇబ్బంది పెట్టడం తగదని అన్నట్లు బ్యానేర్ హెడ్డింగ్ పెట్టడం జరిగింది.

వైసీపీ ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని గగ్గోలు పెట్టే వీరు గత ఐదేళ్లలో ఎంతోమంది వైసీపీ కార్యకర్తలను అన్యాయంగా అరెస్టులు చేసినప్పుడు మాత్రం ఈనాడు గొంతు మూగబోయింది. ఇప్పుడు తమ కులానికి చెందిన ఒక వృద్ధ మహిళ పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే అది రైట్ అనేలా మాట్లాడుతుంది. ఆ వృద్ధ మహిళా రంగనాయకి కూడా ఎంత తెలివిగా వ్యవహరిస్తుందంటే ఆమె పెట్టిన పోస్టుల గురించి సిఐడి అధికారులు ఆమెను విచారిస్తే ప్రజల అభిప్రాయాలని తాను చెప్పానని, ప్రజలలో ప్రబుత్వంపై ఎలాంటి వ్యతిరేక ఉందొ చెప్పానే తప్ప తనకు ప్రభుత్వంపై ఎలాంటి ద్వేషం లేదని చెబుతుందంటే, ఆమెకు టీడీపీ నేతల సపోర్ట్ ఎంతలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

కానీ ఆమె పెట్టిన పోస్టులు ఘాటుగా ఉండటంతో ఆమెకు వెనుక నుంచి ఎంతమంది సపోర్ట్ ఉన్నా ఈనాడు, చంద్రబాబు అండ్ కో ఎంత గగ్గోలు పెట్టినా వదిలే ప్రశ్న అయితే కనపడటం లేదు. ఇలాంటి దగుల్బాజీ రాతలు మొదటి పేజీలో ఈనాడు ప్రయారిటీ ఇవ్వడంతోనే గత ఆరు నెలలుగా అత్యంత దారుణంగా ఈనాడు పత్రిక రేటింగ్ పడిపోతుందని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక్కడ విశేషమేమిటంటే డాక్టర్ సుధాకర్ విషయంలో కులాన్ని బయటకు లాగి ఒక దళితుడిని వేధిస్తున్నారని గొడవచేసిన చంద్రబాబు నాయుడు రంగనాయకమ్మ విషయంలో మాత్రం కులం కార్డు వాడకుండా వృద్ధ మహిళను వేధిస్తున్నారని అంటున్నారంటే ఆ మహిళ కమ్మ కులానికి చెందిన మహిళ కావడమే విశేషం. చంద్రబాబుకు తెలిసిన దిక్కుమాలిన రాజకీయ సీఎం జగన్ కు బాగానే పరిచయం చేస్తున్నాడు. ఈరోజు ఒకేసారి హైకోర్టులో మూడు కేసులపై మొట్టికాయలు.. రంగనాయకమ్మ విషయం… ఇలా జగన్ కు చేతగాని కొత్తతరహా రాజకీయ పాఠాలు నేర్పిస్తూ తన కంటిని తానే చంద్రబాబు పొడుచుకుంటున్నాడేమో అనిపిస్తుంది.

సినిమా షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్..!

15 ఏళ్ళ యువతి సైకిల్ పై తన తండ్రితో 1200 కిమీ ప్రయాణం, పెద్ద సాహసమే